త్రిబుల్ ఐటీ బాసరలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మాన అభినందనలు….
:జడ్పీ బాయ్స్ హై స్కూల్ ఇద్దరు విద్యార్థులకు త్రిబుల్ ఐటీ సీట్లు….
:విద్యార్థులు లక్ష్యంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి….
:మండల విద్యాధికారి కోదాడ, ఎండి సలీం షరీఫ్
Mbmtelugunews//కోదాడ, జులై 05(ప్రతినిధి మాతంగి సురేష్): పి ఎం శ్రీ జెడ్పి బాయ్స్ హై స్కూల్ కోదాడ ఇద్దరు విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసరలో సీట్లు సాధించిన సందర్భంగా శనివారం పాఠశాల ప్రాంగణంలో కోదాడ మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్, విద్యార్థులను శాలువా పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందించడం జరిగింది. జిల్లాలో ఒకే పాఠశాల నుండి ఇద్దరికీ త్రిబుల్ ఐటీ సీటు రావటం గర్వకారణం అని తెలిపారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో జిల్లా టాపర్ గా ప్రతిభ కనబరిచి, తాళ్లూరి రేఖ శ్రీ, కె నరేంద్ర విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసరలో సీట్లు సాధించడం అభినందనీయమని తెలిపారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనపరచడానికి కృషిచేసిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పాఠశాల విద్యా సంబంధమైన విజయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ, ఉపాధ్యాయులు లింగయ్య, శ్రీనివాస్ రెడ్డి, పాండురంగ చారి, ఖాజామియా, వేణు, దేవరాజ్, బ్రహ్మానందం, జానకిరామ్, బడుగుల సైదులు పాల్గొని విద్యార్థులను అభినందించినారు.