దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు మృతదేహంతో ధర్నా.
Mbmtelugunews//భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అక్టోబర్ 17 :భద్రాచలంలోని తెలంగాణ టూరిజం హోటల్ ముందు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు మృతదేహంతో ధర్నా చేపట్టారు. తెలంగాణ టూరిజం హరిత హోటల్లో అవుట్సోరింగ్ వర్కర్ గా పనిచేసిన ఈసంపల్లి నరసింహారావు (40) మనస్థాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడు.గతంలో పది సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ వర్కర్ గా పనిచేసిన నరసింహారావును మేనేజర్ నాగలక్ష్మి డ్యూటీ లో నుంచి తీసివేసి,మళ్లీ తీసుకోకపోవడంతో మూడు నెలలుగా తిరుగుతూ మనస్థాపం చెంది మృతి చెంధాడు.ఎలాంటి ఆరోపణలు లేకుండా హోటల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను యాజమాన్యానికి తెలిపినందుకు తనను డ్యూటీలో తీసివేశారని,ఉన్నత స్థాయి అధికారులు డ్యూటీలోకి తీసుకోమని చెప్పినప్పటికీ మేనేజర్ నాగలక్ష్మి డ్యూటీ కి తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని అందువల్లనే మనస్తాపం చెంది తన భర్త మృతి చెందాడని నరసింహారావు భార్య తెలుపుతోంది.మృతుడి కుటుంబ సభ్యులతోపాటు,బంధువులు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు టూరిజం హోటల్ ముందు ధర్నా చేపట్టారు.వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు.