దశాబ్దాల కళ నేటితో నెరవేరింది….
:కొత్తూరు ప్రజలు రోడ్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూపులు….
:రోడ్లపై రైతులు వీల్స్ తో ట్రాక్టర్లను నడపరాదు…
:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో 15 లక్షల రూపాయలతో సిసి రోడ్డుకు శంకుస్థాపన…
:సర్పంచ్ లిక్కి వెంకటయ్య గురవమ్మ
Mbmtelugunews//కోదాడ, మార్చి 25(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని తొగర్రాయి ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరిందని గ్రామ సర్పంచ్ లిక్కి గురువమ్మ వెంకటయ్య తెలిపారు. బుధవారం తొగర్రాయి స్మశాన వాటిక నుండి కొత్తూరు వరకు 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా చిన్న వర్షం వచ్చిన కొత్తూరు వైపు వెళ్ళుటకు ప్రజలు, పొలాలకు వెళ్ళుటకు రైతులు ఇబ్బంది పడేవారని ఈ సమస్యను గుర్తించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో 15 లక్షల రూపాయలతో సిసి రోడ్డును మంజూరు చేయడం జరిగిందని సిసి రోడ్డు దశాబ్దాలుగా ఉండేలా నాణ్యవంతంగా నిర్మించాలని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ఎన్నో కోట్ల రూపాయలు వెంచించి రోడ్లు నిర్మిస్తుందని రైతులు వీల్స్ తో అట్టి రోడ్లపై ట్రాక్టర్లు నడపరాదని ఈ సందర్భంగా ఆమె కోరారు. గ్రామ పెద్దలు, యువత సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు జడ వెంకటేష్, దేవాలయ కమిటీ చైర్మన్ పగిడిమర్రి మదన్ మోహన్ రావు, సరస్వతి, యాదా శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ఉమామహేశ్వరి శ్రీనివాస్, వార్డు సభ్యులు వినోద్, నరేష్, పుణ్యవతి నాగేశ్వరావు, కనకలక్ష్మి, కొండలు, కిషోర్, సంధ్య, చిన్న వీరయ్య, ఏడుకొండలు, గ్రామ పెద్దలు యాదా వెంకన్న, కన్నేబోయిన వెంకన్న, వెంకయ్య, కాసాని పుల్లయ్య, కాశయ్య, పి శ్రీనివాసరావు, పి రామారావు, వెంకన్న, శ్రీను, కొండలు, నాగేశ్వరావు, కృష్ణయ్య, పి శ్రీనివాసరావు, పి రామారావు, వెంకన్న, శ్రీను, కొండలు, నాగేశ్వరావు, కృష్ణయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.



