కోదాడ,అక్టోబర్ 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణ పరధిలోని కొమరబండ గ్రామంలో ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి 21,500 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.కొమరబండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-98 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడు షేక్ మజీద్ అకాల మరణం వల్ల,నిరుపేదైన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన స్నేహితులు ముందుకు వచ్చినారు.తమకు తోచినంత పోగుచేసి మజీద్ పిల్లల చదువుల ఖర్చుల కోసం భార్యకు 21,500 రూపాయలు నగదు అందజేసినారు.ఈ కార్యక్రమం చట్టు ఉపేందర్,మామిడి రామారావు,దాసరి జయ సూర్య,బత్తుల లింగరాజు,పసుపులేటి అంజిబాబు,కాలతిరిపి కృష్ణ,దేవపంగు ధన మూర్తి,గూడూరు చేన్నారాయుడు,షేక్ జానీ,సంపేట ఉపేందర్,చక్రవర్తి,రన్ హుస్సేన్,కిరణ్,కందుల లక్ష్మయ్య,మద్దెల వెంకన్న,లతీఫ్,ఆతుకూరి నాగలక్ష్మి,మాధురీ,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
దాతృత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు
RELATED ARTICLES



