దాడుల నుండి డాక్టర్ల కు రక్షణ కల్పించాలి
:డాక్టర్లపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి.
:డాక్టర్లపై జరుగుతున్న దాడుల పట్ల కోదాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండన.
:కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన దారుణకు సంఘటనకు నిరసనగా కోదాడలో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ల నిరసన ర్యాలీ.
దుండగులను కఠినంగా శిక్షించాలని మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి,డీఎస్పీ శ్రీధర్ రెడ్డిలకు ఐఎంఏ ఏ ఆధ్వర్యంలో వినతి పత్రాలు.
కోదాడ,ఆగష్టు 17(మనం న్యూస్):దాడుల నుండి డాక్టర్లకు పాలకవర్గాలు రక్షణ కల్పించాలని కోదాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు డిమాండ్ చేశారు.శనివారం కోదాడ పట్టణంలో కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐఎంఏ బాధ్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యశాలలను బంద్ చేసి వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.మహిళా డాక్టర్ పై జరిగిన దారుణ సంఘటనకు బాధ్యులైన దుండగులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సదస్సు హాజరైన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిలకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు మద్దినేని లక్ష్మి ప్రసాద్,డాక్టర్ అశోక్ కుమార్,జాస్తి సుబ్బారావు,బివీఎస్ ప్రసాద్,కొత్త మాస్ జనార్ధన్,దశరథ నాయక్,శ్రీనివాస్ రెడ్డి,ఎల్ భాస్కరరావు,చంద్రమోహన్,ప్రమీల,సిద్ధార్థ రోహిత్,రాజేష్ రెడ్డి,అభిరామ్,లక్ష్మణ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.