దేవాలయం భూములు కౌలు వేలం పాట
కోదాడ,జూన్ 24(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తమ్మర బండ పాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం భూముల( కౌలు ) వేలం పాట గ్రామ పెద్దలు,దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ పరిధిలో బహిరంగ వేలంపాట ( కౌలు ) సోమవారం మిర్యాలగూడ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఈశం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ దేవాలయం భూములు(కౌలు ) వేలం పాట ద్వారా దక్కించుకున్న రైతుల వివరములు
1), సర్వేనెంబర్ 147 (మూడు ఎకరంలు (తరి) సామినేని వెంకటేశ్వర్లు 1,32000/- రూపాయలు
2,) సర్వేనెంబర్ 148 (తరి/ మెట్ట ) ఆరు ఎకరములు మందరపు రమేష్ రెండు లక్షల 61 రూపాయలు.
3), సర్వేనెంబర్ 147 ( రెండు ఎకరంలు మెట్ట) తుమాటి రామయ్య 1,10,000 రూపాయలు
4,) సర్వే నెంబర్ 276 ( ఒక్క ఎకరం, ఒక్క కుంటా తరి) షేక్ నాగుల్ 32 వేల రూపాయలు
5,) సర్వేనెంబర్ 431,433 రెండు ఎకరముల 39 కుంటలు తరి) సూరంపల్లి వీరభద్రం ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయలు కౌలు పాట పాడినారు. ఈ సంవత్సరం మొత్తం కవులు పాట ఆరు లక్షల 50 వేల రూపాయలు లకు పాడినారు గత సంవత్సరం ఇదే పాట మూడు లక్షల 35 వేలకు పోయినది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు పాట పాడి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు,దేవాలయం చైర్మన్ బత్తినేని వేణు,దేవాలయ ఈవో తుమ్మల వెంకట చలపతి,శంబిరెడ్డి,దేవాలయ కమిటీ సభ్యులు సామా రాధ కృష్ణారెడ్డి మాజీ చైర్మన్ కనగల శ్రీధర్,బొల్లు ప్రసాద్, కనగాల రవి, కేఎల్ఎన్ ప్రసాద్,సజ్జ వెంకటేశ్వరరావు,మందరపు బిక్షమయ్య,కోదాటి లక్ష్మీనారాయణ,సామినేని నరసింహారావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.