దేవాలయానికి గోదానం
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,జనవరి 02 (ప్రతినిధి మాతంగి సురేష్),మండల కేంద్రంలోని కాలవడ్డలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చైర్మన్ కోడారు వెంకటేశ్వర్లు తండ్రి సత్యం,తల్లి పున్నమ్మ సహకారం తో గోవును దేవాలయానికి దానం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ అర్చకులు చించాపట్టడం రజనీకాంత్ ఆచార్య,కమిటీ సభ్యులు అభినందించి సన్మానం చేశారు.దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు రోజా భవాని,నెల్లూరు పవన్ కుమార్,రచన,దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు లక్ష్మయ్య,కమిటీ సభ్యులు కొడారు శ్రీనివాసరావు,బొబ్బ సమ్మిరెడ్డి,కట్టెకోల చంద్రయ్య,గోగుల వీరభద్రం,కోలా వెంకటమ్మ,కట్టెకోల ఉమా తదితరులు పాల్గొన్నారు.