దేవాలయ భూముల కౌలు వేలంపాట
Mbmtelugunews//కోదాడ,జూన్ 20 (ప్రతినిది మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని తమ్మర గ్రామంలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి
దేవస్థానం ఆలయ భూముల కౌలు వేలం పాటలను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో దేవాలయ కార్యనిర్వాహణాధికారి తుమ్మల వెంకట చలపతి, దేవాలయ కమిటీ చైర్మన్ బత్తినేని వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన పాటలలో తోట దగ్గర 3 ఎకరాలు తూమాటి రామయ్య 1,32,000 కు పాడడం జరిగింది. అలాగే 6 ఏకరాలు సామినేని వెంకటేశ్వర్లు 2,69,000 వేలకు, సామినేని వెంకటేశ్వర్లు 2 ఎకరాలు తోట బీడు1,07,000 కు, ఒక ఎకరము రావి కుంట చేను షేక్ రియాజ్ 33,000 వేల రూపాయలకు, రెండున్నర ఎకరాల మాగాణి షేక్ హుస్సేన్ 1,06,000 రూపాయలకు పాడుకోవడం జరిగినది. ఇట్టి భూమి రెండు పంటలు రైతులు కౌలుకు చేసుకోవచ్చు అని తెలిపారు. మొత్తం దేవాలయ భూమి వేలంపాట 6,47,000 రూపాయలకు పాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడో వార్డు మాజీ కౌన్సిలర్ సామినేని నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనకాల రాధాకృష్ణ, రైతులు బొల్లు ప్రసాద్, కనకాల శ్రీధర్, బొల్లు నరేష్, కిరణ్ రెడ్డి, కేఎల్ఎన్ ప్రసాద్, తూమాటి రామయ్య, శ్రీనివాసరావు, సామినేని సుబ్బారావు, జానిమియా తదితరులు పాల్గొన్నారు.