దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యండి : సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 02( ప్రతినిధి మాతంగి సురేష్): శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గల శివాలయము శ్రీ వరవర రంగనాయక దేవాలయ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయుట కొరకు ఆర్డిఓ సూర్యనారాయణకు సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన ఊరు – మన వారసత్వం (మేరా గాన్ మేరీ దారోహర్) పథకం కింద గ్రామంలో దేవాలయ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ జాతీయ పథకం మన ఊరు – మన వారసత్వం ఆధారంగా, గ్రామ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి గ్రామ సభ తీర్మానం చేసింది. ఈ పథకం గ్రామాల సాంస్కృతిక మ్యాపింగ్, హెరిటేజ్ సైట్లు, ఆలయాలు, సంప్రదాయాలు డాక్యుమెంట్ చేయడంపై దృష్టి సారిస్తుంది.
దీని కింద గణపవరం గ్రామంలోని శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దులను అధికారిక సర్వే ద్వారా నిర్ణయించి, రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు.
రెవెన్యూ & సర్వే శాఖ అధికారులు త్వరగా సర్వే నిర్వహించి, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని మనవి. ఇది గ్రామ వారసత్వ పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు అందజేయడానికి కీలకమైనదని అన్నారు.



