Tuesday, December 23, 2025
[t4b-ticker]

దేశంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నిర్మూలనే భారత ప్రభుత్వ లక్ష్యం

దేశంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నిర్మూలనే భారత ప్రభుత్వ లక్ష్యం

:ఒక్క టీకా పశు ఆరోగ్యానికి లేదు డోకా – పాల సిరుల తో దేశం సు సంపన్నం

:పశువులకు ఆరోగ్యం, మానవాళికి ఆహార భద్రత దేశానికి విదేశీ ఆదాయం .

:పశువుల్లో అంటువ్యాధుల నివారణ టీకా ప్రారంబోత్సవంలో అసిస్టెంట్ డైరెక్టర్ డా,పి పెంటయ్య.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): 7వ, విడత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం కోదాడ పట్టణం బాలాజీనగర్ నుండి ప్రారంభం. కోదాడ పట్టణం బాలాజీనగర్ లో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం ప్రారంబించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా,పి పెంటయ్య. అనంతరం పశుపోషకులకు నిర్వహించిన అవగాహణ కార్యక్రమములో మాట్లాడుతూ నేటి కాలంలో మనం ఏం తినాలన్నా తాగాలన్నా కల్తీ లేని, ఆరోగ్యమైన ఉత్పతులకై ఒకటికి రెండు పర్యాయాలు అలోచించాల్సి వస్తుంది. చివరకు మన పశు ఉత్పతుల్ని విదేశాలకు ఎగుమతి చేయాలన్నా మన పశు ఆరోగ్యాన్ని ద్రువీకరించుకోవాల్సిన పరిస్థితి .
దేశంలోని సమస్త పశుసంపదను అత్యంత ఆర్దిక నష్టం చేకూర్చే గాలికుంటు అంటూ వ్యాధి నుండి రక్షించడానికి, దేశంలో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి భారత ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రణాళికతో ప్రతీ ఆరుమాసాల కి ఒకసారి గలికుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పుడు ౭వ విడత టీకా కార్యక్రమాన్ని నిర్వహిన్తున్నాం. ఈ టీకా కార్యక్రమములో పశుపోశకులంతా ఏమరుపాటుగా ఉండాలనీ ఏ ఒక్క పశువు టీకా వేయకుండా మిగిలినా అది వ్యాధిని ఇతర పశువులకు వ్యాపింప చేస్తుంది అని, మూడు మాసాల వయసున్న దూడ నుండి నిండు చులు పశువు వరకు అన్నింటికీ టీకా వేయించాలని సూచించారు.
కొందరు పశుపోషకులు టీకా వేస్తే జ్వరం వస్తుందని, పాలు తగ్గుతాయని, సూడి పశువులకు సమస్య అవుతుందనే అపోహలతో తమ పశువులకు టీకా వేయించకుండా ఆపుతున్నారని అలా చేస్తే భవిష్యత్ లో వారి పశువులతో పాటు ఆ గ్రామ పశువులన్నీ వ్యాధి భారిన పడి రైతులంతా ఆర్దికంగా నష్టపోతారు. గాలికుంటు వ్యాధి పశువు ప్రాణం తీయకుండా రైతు లాభాలు లాగేసుకుని, ఆర్దిక కున్గుబాటు కల్పించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అన్నది ప్రతీ ఒక్కరు గుర్తుంచుకొని అన్ని పశువులకీ టీకాలు వేయించుకోవాలని సూచించారు. టీకా వేసిన పశువుల వివరాలన్నీ ఏరోజుకారోజు భారత్ పశుధాన్ పోర్టల్ లో పశువుల చెవులకు వేసిన చెవిపోగు నెంబర్ ఆధారంగా అంతర్జాలములో నమోదు చేయడం జరుగుతుందని తద్వారా మీ పశువుల క్రయవిక్రయాలపై టీకా ప్రభావం ఉంటుందని, మార్కెట్ లో పశువల విలువ పడిపోకుండా ఉండాలంటే తప్పని సరిగా టీకా వేయించాలని అన్నారు.
టీకా కార్యక్రమం ఉదయం 7.00 గంటల నుండి 11.00 గంటలవరకు చల్లటి వాతావరణంలో నిర్వహించాలని సిబ్బందికి సూచిస్తూ, నవంబర్ 14 వ తేదీ వరకు టీకా కార్యక్రమం అందుబాటులో ఉంటుందని ప్రతీ వార్డుకి సిబ్బంది వచ్చి ఇంటివద్దనే టీకాలు వేస్తారని, పశువులకు చేవిపోగులు లేనట్లైతే కొత్తవి వేయించుకోవాలని, చెవిపోగు లేనట్లయితే పశువు వివరాలు శాఖ వద్ద నమోదు కావని పశుపోషకులు గుర్తించాలన్నారు.ఈ
టీకా కార్యక్రమములో పశుపోషకులు స్వామి, సైదా, బాలాజీ, సిబ్బంది సాగర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular