దొంగను పట్టుబడి చేసిన పట్టణ పోలీసులు
కోదాడ,జులై 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హుజూర్ నగర్ లోని ఎన్ఎస్పి క్యాంప్ లో నివాసం ఉంటున్న మామిడి గోపి తండ్రి నాగయ్య అను వ్యక్తి ఏ పని చేయకుండా జులాయి గా తిరుగుచు మోటార్ సైకిళ్ళు,దేవాలయాలలో హుండీ లను పగులగొట్టి దొంగతనం I చేయుచున్నాడు.ఇతడు కోదాడ టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలో ఒక మోటార్ సైకిల్,మిర్యాలగూడ పట్టణ పోలీసు స్టేషన్ పరిదిలో ఒక మోటార్ సైకిల్,పెన్ పహాడ్ పోలీసు స్టేషన్ పరిదిలో రెండు దేవాలయాలలో హుండీలను,నూతనకల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక దేవాలయం నందు హుండీని,కూసుమంచి పోలీసు స్టేషన్ పరిదిలో దేవాలయం నందు హుండీ పగులగొట్టి దొంగతనాలు చేసినాడు.ఈ రోజు అనగా శుక్రవారం ఉదయం దొంగతనం చేసిన వస్తువులను అమ్ముటకు వెలుచుండగా వాహనాలు తనిఖీ చేయుచుండగా సదరు వ్యక్తిని పట్టుబడి చేసి విచారించి ఇతని వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్ళు,ఒక ఆటో,నాలుగు ఇత్తడి గంటలు,నగదును స్వాదీనము చేసుకొని కోర్టు నందు హాజరు పరుచనైనదని కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ ఆప్ పోలీస్ టి రాము తెలిపారు