ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించాలి.
:ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి:కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్)ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు.గురువారం పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ అవగాహన కల్పించారు.డ్రైవింగ్ చేస్తున్నవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనం యొక్క ఆర్సి పేపర్లు,ఇన్సూరెన్స్,పొల్యూషన్ వంటివి తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.నెంబర్ ప్లేట్ లేకుండా,సెల్ ఫోన్,డ్రంక్ అండ్ డ్రైవ్,త్రిబుల్ రైడింగ్,ర్యాష్ డ్రైవింగ్,మైనర్ లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.వాహనాన్ని నడిపేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఏఎస్ఐ సిఎస్ రావు,హెడ్ కానిస్టేబుల్ సమ్మద్,హోంగార్డులు శ్రీను,వెంకన్న,ప్రభాకర్ తదితరులు ఉన్నారు.