Saturday, December 27, 2025
[t4b-ticker]

నడవండి!! మంచి ఆరోగ్యాన్ని పొందండి!!

కోదాడ,ఏప్రిల్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:యాంత్రిక జీవనంలో నిత్యం పని ఒత్తిడి,మొబైల్ తో గడుపుతూ ఉంటాము.కానీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని తెలుసుకోలేక పోతున్నాము.మంచి ఆరోగ్యం కొరకు ఆటలు,వ్యాయామం,యోగ,డాన్సింగ్,తోటపని,వాకింగ్ లాంటి ఎన్నో అలవాట్లు పెంచుకోవచ్చు.

*నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి*.

-నడక ఎముకలు,కండరాలను బలోపేతం చేయడానికి,సమతుల్యత,సమన్వయాన్ని మెరుగుపరచడానికి,నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నడక శారీరక,మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.ఇది మీ శరీరంలోని సోమరితనాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

-రోజుకు కేవ‌లం 20 నిమిషాలు న‌డిస్తే.. ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా? ఇకనైనా అలవాటు చేసుకోండి..

నేటి బిజీ లైఫ్‌లో ప్రజలు, ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం కూర్చొని గడుపుతున్నారు.ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.ఐటీ సెక్టార్ సహా వివిధ రంగాల వారికి గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం అలవాటు.పెద్దగా నడవడం తగ్గిపోయింది. అంతేకాదు..ప్రజలు తమ రోజు వారి దినచర్యలతో చాలా బిజీగా ఉంటున్నారు.తినడం,తాగటం సమయాలను పక్కన పెడితే, సాధారణ నడక వ్యాయామం చేయడానికి కూడా తగినంత సమయం లేదు.కానీ,వాకింగ్‌ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.ఇది విశ్వాసం,మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయ
పడుతుంది.చాలా మంది ఫిట్ గా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు.ప్రతి ఒక్కరూ వారి సౌకర్యం,ప్రాధాన్యత ప్రకారం వ్యాయామాన్ని ఎంచుకుంటారు.

-ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 20 నిమిషాలు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూర్చునే వ్యాయామం వాకింగ్ వంటి ప్రయోజనాలను అందించదు.రోజుకు కనీసం కొద్ది దూరం నడవడం వల్ల కండరాలు ఉత్తేజితమవుతాయి.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.కూర్చోవడం వల్ల కాళ్లలోని రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది.ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది.రక్తపోటును పెంచుతుంది.

కేవలం 20 నిమిషాల నడక వల్ల బ్లడ్ షుగర్,బ్లడ్ ప్రెజర్ తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.ప్రతిరోజూ 20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..

-బరువు తగ్గడంలో సహాయపడుతుంది.నడక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడే మంచి కార్డియో వ్యాయామం.బరువు తగ్గాలంటే రోజుకు 20 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది.

రోజుకు 20 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.

నడక గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటు,కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే,ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.నడక కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

*మానసిక ఆరోగ్యం కి నడక మేలు*

రోజుకు 20 నిమిషాలు నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.నడక ఒత్తిడి,ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది విశ్వాసం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

*శరీర ధృడత్వం కి నడక మేలు*

బలమైన ఎముకలు,కండరాలు..
నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.నడక ఎముకలు,కండరాలను బలోపేతం చేయడానికి,సమతుల్యత,సమన్వయాన్ని మెరుగుపరచడానికి,నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.నడక శారీరక, మానసిక & శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఇది మీ శరీరంలోని సోమరితనాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

*నడక శారీరక, మానసిక ఆరోగ్యం ను మెరుగుపరుస్తుంది*
_చారుగుండ్ల రాజశేఖర్.
వ్యక్తిత్వ వికాస నిపుణులు & విజయీభవ ట్రస్ట్ వ్యవస్థాపకులు.
       

సకల మానవులకు శరీరమే ధర్మసాధక యంత్రం.ఆ శరీరాన్ని రక్షించే దైవం ఆరోగ్యమే.
‘‘శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’
అన్నాడు మహాకవి కాళిదాసు.మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి.దాన్ని సంరక్షించుకోవాలి.అంటే శరీరాన్ని నడక,వ్యాయామం,లాఫింగ్ తెరొపి,డాన్సింగ్,యోగ,క్రీడలు ఏదో ఒక అలవాటు ఉండాల్సిందే.కావున రోజులో 45 నిముషాలు ఎవరికి వారు వీటికి కేటాయించి ఆరోగ్యాన్ని జబ్బుల బారినుంచి కాపాడు కోవాలి.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular