కోదాడ,జులై 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మూడు గంటలు నశించాలి- మూడు పంటలు వర్ధిల్లాలి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజా ప్రతినిధులు,పార్టీ శ్రేణులు,రైతు సంఘాల నాయకులు,రైతులు పాల్గొన్న రైతులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ రైతు రాజ్యాన్ని కొనసాగిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ రైతుల్ని చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందన్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. 24 గంటల కరెంట్ రద్దు చేసి…3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ అన్నారు.కాంగ్రెస్ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటి మర్చిపోదన్నారు.కాంగ్రెస్ కాలంలో కరువులు..కన్నీళ్లు..కటిక చీకట్లు..అప్పులు..ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారన్నారు..కరెంట్ రాకడ..ప్రాణం పోకడ తెలియదన్నట్టుగా ఆనాడు విద్యుత్ కోతలతో…చాలీ చాలని 3 గంటల నాసిరకం కరెంట్ తో రైతులు నరకం అనుభవించారన్నారు.కాలిపోయే మోటర్లు..పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో ఎండిన పంటలు.. రైతుల ధర్నాలు..సబ్ స్టేషన్లపై దాడులతో పరిస్థితులు దారుణంగా వుండేవని, అలాంటి దుర్భరమైన పరిస్ధితులు గత 9 ఎళ్లుగా మారిపోయాన్నారు.అర్ధరాత్రి అపరాత్రి దొంగరాత్రి..మోటర్లు పెట్టడానికి పోయి పాములు కుట్టి.. కరెంట్ షాకులు కొట్టి మృత్యువాత పడ్డ రైతులు కాంగ్రెస్ పాలన పరిస్ధితులను తలుచుకునేందుకు కూడా సిద్దంగా లేరన్నారు.ఒక్క కరెంటే కాదు…నాడు కాంగ్రెస్ హయాంలో ఎరువుల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మే దుస్థితి ఉండేదని, కిలోమీటర్లు దూరం క్యూలైన్లలో చెప్పులు..లాఠీచార్జీల దృశ్యాలే కాంగ్రెస్ పాలనా పాడుకాలంలో ఉండేవన్నారు. కాంగ్రెస్ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు మాత్రమేనని ఆయన అన్నారు.
నడిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదిక లో కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు యుద్ధ వేదిక కార్యక్రమం
RELATED ARTICLES