కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ప్రజలు గత ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న 108 అంబులెన్స్ నడిగూడెం మండల కేంద్రానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ కి మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కి మరియు జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్,నడిగూడెం జెడ్పిటిసి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్రానికి ఒక అంబులెన్స్ చొప్పున కేటాయించినందుకు అదే విధంగా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో అదనపు సిబ్బందిని నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. గతంలో మండల కేంద్రంలో ఏదైనా సంఘటన జరిగితే 108కి కాల్ చేస్తే వాహనం వచ్చేసరికి బాధితులు చాలా ఇబ్బందులు పడేవారు అని అలాంటి ఇబ్బందులు లేకుండా మండల కేంద్రాలకు కంప్లైంట్స్ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉంటారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ వైద్యశాలలలో మెరుగైన ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి అందుతుందని అన్నారు.
నడిగూడెం మండల కేంద్రానికి 108 అంబులెన్స్ సౌకర్యం కల్పించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు:బాణాల కవిత నాగరాజు
RELATED ARTICLES