Saturday, February 28, 2026
[t4b-ticker]

నర్సరీల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి….

నర్సరీల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి….

:హరిత హారం విజయ వంతానికి నర్సరీ లే కీలకం….

:హరిత కోదాడ నర్సరీలతో నే సాధ్యం…..

:మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు…

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 28(ప్రతినిధి మాతంగి సురేష్):హరిత కోదాడ నర్సరీలతో నే సాధ్యం అవుతుందని, అధికారులు, సిబ్బంది నర్సరీల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణం లోని ఉత్తమ్ పద్మావతి నగర్ లో నర్సరీ, వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్నీ ఆమె పరిశీలించి మాట్లాడారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రానున్న వేసవి తీవ్రత కు మొక్కలు ఎండి పోకుండా నిత్యం నీరు పోస్తూ వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మొక్కల తోనే సాధ్యం అవుతుందన్నారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుందని ఆ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్నీ పరిశీలించి, అధికారులు ఈ కేంద్రాన్ని వినియోగం లోకి తేవాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత కు మున్సిపల్ పాలక వర్గం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఈఈ భవాని, సీనియర్ నాయకులు కొల్లు క్షత్రయ్య, దేవమని తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular