నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్
Mbm telugu news//నడిగూడెం, డిసెంబర్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్) మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామం లో గ్రామ సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో కూలీలను పెట్టి ప్రతి బజారు పరిశుభ్రత, పరిశుద్ధ పనుల శ్రమ దాన కార్యక్రమం 2026-27 నర్సరీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పల్లెలు పరిశుభ్రంగా ఉంటే ఆ పల్లెలో నీ ప్రజలు ఆరోగ్యం సుభిక్షంగా ఉంటారు అందువలన ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య, పప్పుల ఉపేందర్, శివరాత్రి వీరబాబు, సంకోజు కర్ణ చారి, పప్పుల ఉమ, కలకొండ మనోజ్, పచ్చిగోళ్ళ స్వరూప, గ్రామ పెద్దలు గుజ్జరలపూడి అర్జున్ రావు, సంకోజు జానయ్య, మొదలగు వారు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.



