నల్లబండగూడెం పిఎసిఎస్ ధాన్యం కోనుగోలుకేంద్రంను పరిశీలించిన కలెక్టర్
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 08 (ప్రతినిధి మాతంగి సురేష్):వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలీ,రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అన్నారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తాదని అన్నారు.రైతులు దళారుల చేతులో మోసపోవద్దన్నారు.ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరను రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ,ఎమ్మార్వో వాజిద్ అలీ,కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి,చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ కొత్త రఘుపతి రైతులు పాల్గొన్నారు.