నల్లబండగూడెం శ్రీ సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు..
Mbmtelugunews//కోదాడ, జూలై 10(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని నల్లబండగూడెం శ్రీ సాయి మందిరంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు, టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ తాజా ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి దేవాలయంలో తెల్లవారుజాము నుండే పంచామృత అభిషేకాలు, అర్చనలు, హారతి నివేదన, తీరొక్క పూలతో అలంకరణ, హారతి నివేదన, పల్లకి సేవ, వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనుల పండువగ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు సుమారు పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు, గ్రామ పెద్దలు అలసకాని శరభయ్య, ముండ్రా రంగారావు, ఏ శ్రీనివాసరావు, ముండ్రా శివరామకృష్ణ, ఎం రామకృష్ణ, ఆదినారాయణ, ఎన్ వెంకటేశ్వర్లు, ఎం నర్సింగరావు, బొల్లు రాంబాబు, ముండ్రా రమేష్, పూర్ణయ్య, సుందర్రావు, భాస్కర్ రావు, విశ్వేశ్వరరావు, సుధాకర్ రామారావు, వేలాదిమంది మహిళా భక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చిన సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు.