నల్లబండగూడెం సాయి మందిరంలో విశేష పూజలు
Mbmtelugunews//కోదాడ, మార్చి 19(ప్రతినిధి మాతంగి సురేష్):తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా గురువారం మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలోని సాయిబాబా మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. ఉగాది కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి సాయిబాబాను దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. మేకల వెంకట్రావు, ప్రమీల దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు, అర్చకుడు సాయి శర్మ, ముండ్రా రామారావు, నల్లపాటి ఆదినారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.



