నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని: బిజెపి నాయకులు జల్లా జనార్దన్ రావు
శివ సైనిక్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): గణేష్ నవరాత్రి ఉత్సవాలను గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని బిజెపి నాయకులు జల్లా జనార్దన్ రావు అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని కోమరబండ వడ్డెర కాలనీ నందు శివ సైనిక్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా సోమవారం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూర్యాపేట జిల్లా బిజెపి నాయకులు జల్లా జనార్దన్ రావు పాల్గొని ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముగ్గుల పోటీల బహుమతులు దాతలు మొదటి బహుమతి బత్తిని పూర్ణ, రెండవ బహుమతి జల్లా జనార్ధన్ రావు, మూడో బహుమతి సతీష్ రాజ్ పురోహితులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళా సభ్యులు మొదటి బహుమతి నాగజ్యోతి, రెండోవ బహుమతి పూజ, మూడోవ బహుమతి దివ్య, నాలుగో బహుమతి మల్లేశ్వరి, సభ్యులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ సైనిక్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సాయికుమార్, గోపి, వాసు, సుల్తాన్, అఖిల్, వెంకటేష్, కాలనీవాసులు, భక్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.



