నవోదయ స్కూల్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర గవర్నర్
Mbmtelugunews//కోదాడ, జనవరి 17(ప్రతినిధి మాతంగి సురేష్): రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూర్యాపేట జిల్లా కోదాడ లోని కెఆర్ఆర్ డీగ్రీ కాలేజీ స్థలం లో నిర్మించనున్న నవోదయ స్కూల్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేయుచున్న సందర్భంగా శనివారం ఆ ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కెఆర్ఆర్ డీగ్రీ కాలేజీ స్థలంలో నిర్మించనున్న నవోదయ స్కూల్ భవనం నిర్మాణానికి శంకస్థాపన సందర్భంగా అధికారులు ముందస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అప్రోచ్ రోడ్లు వేయాలని, శిలాఫలకం తయారు చేయించి అమర్చాలని, స్టేజి,

శామియానాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లు, గ్రౌండ్ చదును చేయించాలని, దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రే చే యించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్డిఓ సూర్యనారాయణ, ఇంచార్జ్ డిఆర్డిఏపీడీ శిరీష, డీపీఓ యాదగిరి, డిఎస్ఓ మోహన్ బాబు, తహసీల్దార్ వాజీద్ అలీ, ఎంఈఓ సలీం షరీఫ్, ఆర్ & బి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



