సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల జిల్లా ప్రాదేశిక సభ్యులు కడియం ఇందిర పరమేశ్వర్ పార్టీని వీడనున్నరా?
ఒకవేళ పార్టీ మారితే ఎటు వైపు వారి ప్రయాణం?
తుంగతుర్తి నియోజక వర్గంలో ఎమ్మేల్యే కు అసమ్మతి వర్గం ఎక్కువ అవడం వల్ల కడియం ఇందిర పరమేశ్వర్ ను ఎమ్మేల్యే వర్గం సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.? నాగారం మండల జిల్లా ప్రాదేశిక సభ్యులు ఆలోచన ఏమిటి?
ఈరోజు తిర్మలగిరిలో జరిగిన సభలో కనిపించని నాగారం మండల జిల్లా ప్రాదేశిక సభ్యులు?
ప్రజలు అనుకుంటున్నట్లగా ఎమ్మేల్యే కు వీరికి మధ్యలో ఏమైన వర్గపోరు నడుస్తున్నదా?
దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడుగ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1995లో తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి…
ఆయన చురుకుధనాన్ని గమనించిన ఆనాటి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆయనను నల్గొండ జిల్లాలో 12నియోజక వర్గాల నుంచి ఇంచార్జులను పెట్టే సందర్భంలో ఆరోజుల్లోనే జనరల్ అసెంబ్లీ స్థానమైన తుంగతుర్తి నియోజకవర్గానికి కడియం పరమేశ్వర్ ఇంచార్జి గ నియమించారు.
అలాంటి అనుభవం నాయకుడు కడియం పరమేశ్వర్.
గత జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణిని కడియం ఇందిరను నాగారం మండల నుండి పోటీలో ఉంచి మంత్రి జగదీష్ రెడ్డి సొంత ఊరు,మందలో విజయం సాధించిన విషయం తెలిసిందే!
గెలిచిన కొద్దికాలానికి తిరిగి అధికార పార్టీ ఆనాటి తెరాస నేటి బి.అర్.ఎస్.లో చేరిన విషయం తెలిసిందే.
మరెందుకు కొంత కాలంగా పార్టీ కర్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో అర్దం కావడంలేదు అని నాగారం మండల ప్రజలు అనుకుంటున్నారు.అతిత్వరలో బి.అర్.ఎస్ పార్టీ నుండి బయటకి వెళ్లి అవకాశం ఉందని తెలుస్తోంది?
అక్కడ నుండి బయటకి వెళితే(పార్టీ మారితే)ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు అని నాగారం మండల ఓటర్లు అనుకుంటున్నారు.
(ఒకవైపు తీర్మలగిరి మునిసిపల్ ఛైర్మెన్ పోతరాజు రజినీ వ్యతిరేక దిశలో మాట్లాడుతున్న విషయం తెలిసిందే..)
సీనియర్ నాయకుడు కడియం పరమేశ్వర్ నాగారం మండలంలోని కాదు తుంగతుర్తి నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజలకు తెలిసిన వ్యక్తి ..మరి కడియం ఇందిర పరమేశ్వర్ ఏదారిన ఎటు వైపు ప్రయాణం కొనసాగించనున్నారు అని నాగారం మండల ఓటర్లు గుసగుసలువినిపిస్తున్నాయి.