*
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)నాగారం మండలం ; గత కొద్దీ రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం SI గారు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, కాలువలు ఉదృతంగా ప్రహిస్తున్నాయని అలాంటి సమయంలో ఎవరూ కూడా వాటిని దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు సూచించారు. మరియు అదేవిధంగా పాడుబడిన మిద్దెలు, పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లల్లో, చెట్ల కింద, వాగుల వద్ద ఉండవద్దని సూచించారు. ముఖ్యంగా వచ్చే రెండు రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు పొలాల్లోకి వెళ్లి వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ మోటార్లు వద్దకు వెళ్లి స్వీచ్ ఆన్ చేయవద్దని,చెట్ల క్రింద ఉండవద్దని రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.రోడ్ల పక్కన వున్న విద్యుత్ స్తంబాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.