నాలుగు తరాలు పేద ప్రజలకు గుర్తుండి పోయే నాయకుడు వైఎస్ ఆర్
:మాజీ సర్పంచ్ ఎర్నేని ఆధ్వర్యం ఘనంగా వైఎస్ ఆర్ జయంతి వేడుకలు
Mbmtelugunews//కోదాడ, జులై 07(ప్రతినిది మాతంగి సురేష్): నాలుగు తరాలు పేద ప్రజల గుండెలలో గుర్తుండి పోయే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళ వారం మాజీ సీఎం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పట్టణం లోని వైఎస్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, రెండు రూపాయల కు కిలో బియ్యం,108, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఅంబరెస్ మెంట్, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ లు, ఉచిత విద్యుత్ అమలు చేసి ప్రజల గుండె ల్లో సంక్షేమ పథకాల ఆరాధ్య దైవం గా నిలిచారని వైఎస్ సేవలను గుర్తు చేశారు. ప్రపంచం ఉన్నంత కాలం వైఎస్ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు. రైతుల పక్ష పాతి గా నిలిచి వ్యవసాయం పండుగ లా మార్చిన రైతు బంధవుడన్నారు. ప్రతి ఒక్కరు నేటి యువత వైఎస్ ఆశయాలను సాధించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు రావెళ్ల కృష్ణా రావు, చామర్తి బ్రహ్మం, నెమ్మది దేవ మణి ప్రకాష్, మైలారి శెట్టి భాస్కర్, చందు నాగేశ్వరరావు, లైటింగ్ ప్రసాద్, గంధం పాండు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.