Monday, July 7, 2025
[t4b-ticker]

నాలుగు దిరిశన చెట్లు నరికివేత

నాలుగు దిరిశన మొక్కలు నరికివేత

:అందరూ మొక్కలు నాటుతుంటే ఇక్కడ మాత్రం మొక్కలు నరుకుతుంటారు

:రాత్రి సమయంలో చెట్లను నరుకుతున్న చెట్ల దొంగలు

:పట్టించుకోని సంబంధిత అధికారులు

కోదాడ,జులై 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఆర్టిఏ ఆఫీస్ ఎదురుగా రోడ్డు పక్కన గల 10 నుండి 15 సంవత్సరాల మధ్య గల నాలుగు దిరిశన చెట్లను శనివారం రాత్రికి రాత్రే నరికిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండపాలెం 3వ వార్డు పరిధిలోని ఆర్టిఏ ఆఫీస్ ఎదురుగా గల రోడ్డు వెంబడి నాలుగు దిరిశన చెట్లు రాత్రికి రాత్రే నరికి రోడ్ వెంబడి పడేసి వెళ్ళినారని రోడ్డు వెంబడి దుకాణదారులు వాపోతున్నారు.ఈ చెట్లు రోడ్ల వెంబడి దుకాణదారులకి ఎంతో నీడతోపాటు ఆర్టిఏ ఆఫీస్ కి వచ్చే వందలాదిమంది కి నీడనిస్తూ ఈ చెట్ల కింద చాలామంది చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు.అలాంటి చెట్లను మేము షాపులు బంద్ చేసే టయానికి చెట్లు చక్కగా ఉన్నాయి.

తెల్లారే షాపులు తీద్దామని వచ్చేసరికి చెట్ల దొంగలు చెట్లు నరికి వచ్చి వెళ్లే వాహనదారులకు ఇబ్బందికరంగా రోడ్డుమీద పడేసి వెళ్లిపోయారని వాపోతున్నారు.అలాంటి చెట్ల దొంగలను పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దుకాణదారులు వాపోతున్నారు.గత రెండు రోజుల క్రితమే ఇదే వార్డు పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.నిర్వహించిన మరుసటిరోజే చెట్లు నరకడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలు హవాక్కయ్యారు.అసలే వర్షాలు రాక గ్రౌండ్ వాటర్ లేక త్రాగునీరుకి సాగు నీరుకి రైతులు,ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటండి, ఆరోగ్యాలు కాపాడుకోండి అని హరితహారం నిర్వహిస్తుంటే మొక్కలు నాటాల్సిది పోయి మొక్కల్ని దొంగతనంగా రాత్రికి రాత్రి నరికి వేస్తున్నారని దుకాణదారులు వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు ఈ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి కెమెరాలను చెక్ చేసి చెట్లదొంగలపై తగు చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.

*:మున్సిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లను చరవాణి ద్వారా వివరణ అడగగా*

ఈ మొక్కలు నరకడంలో మాకు ఎలాంటి సమాచారం లేదని వారు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular