కోదాడ,ఆగష్టు 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నా జీవితం ప్రజాసేవకే అంకితం అవినీతి రహిత కోదాడే లక్ష్యంగా కోదాడ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నానని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.గురువారం మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ ప్రధాన రహదారిలో భారీ జనసంద్రోహం నడుమ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజలు చూస్తున్నారు అని అన్నారు.ఇంకా గ్రామాలలో ప్రభుత్వ పథకాలు అందక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ పిల్లల్ని స్కూలుకు కూడా పంపించలేని జీవితాలు నియోజకవర్గంలో కోకొల్లలుగా ఉన్నాయని అన్నారు.అధికార పార్టీ అసమ్మతి నాయకులు,ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నికలు వస్తున్నాయంటే సీటు మీద ఉన్న ప్రేమ ప్రజల సమస్య మీద కనిపించడం లేదని వారు ఎక్కడైనా కోదాడ నియోజకవర్గ సమస్యలపై గలమెత్తిన చరిత్ర గాని దాఖలాలు గాని లేవని అన్నారు.

ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు ఎలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే నియోజకవర్గం బాగుపడుతదో వారికి బాగా తెలుసని అన్నారు.నియోజకవర్గంలో కొత్త తరాన్ని యువతను కోరుకుంటున్నారు అన్నారు. రాబోయే రోజులలో జరిగే ఎన్నికలలో నేను నియోజకవర్గ నుంచి పోటీ చేస్తాను ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశనేని,తోట కమలాకర్,వినయ్,శ్రీకాంత్,కతిమాల వెంకన్న,బండి గోపి,అల్లే బోయిన పవన్,గుంజ నవీన్,మొండితోక బాబు,జానకి రాములు,బాలు,గణేష్,బాలాజీ,సైదులు,కిషన్,శ్రీవాణి,వీరలక్ష్మి,సునీత,రమణ,గౌతమి తదితరులు పాల్గొన్నారు.



