కోదాడ,నవంబర్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం,మంగలితండ,చిమిర్యాల గ్రామాలలో గల శ్రీ లింగమంతుల స్వామి,షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..నేను ఇక్కడే పుట్టాను..ఇక్కడ పెరిగాను..నా గతమంతా ఇక్కడే..భవిష్యత్తు అంతా ఇక్కడే…నా జీవితం ప్రజాసేవకే అంకితమని తెలిపారు.మీ బిడ్డగా మరో సారి మీ ముందుకు వచ్చా ఆశీర్వదించండి..నేను దాచుకోవడానికి,దోచుకోవడానికి రాలేదని ప్రజాసేవ చేసేందుకు వచ్చానని తెలిపారు.రాజకీయంలోకి రాకముందే నేను సంపాదించిన సంపాదనతో ఇక్కడ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేశారు.అపోహలు వీడాలని,అనుమానాలు వద్దని అందరి లక్ష్యం బిఆర్ఎస్ గెలుపుపేనని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను,చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందన్నారు.

ఇప్పటికే రైతుబీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తుండగా ఇకనుంచి తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా అందిస్తానని ప్రకటించారన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు,రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం,రైతుబంధు రూ.16వేలు,ఆసరా పెన్షన్లు పెంపు వంటి వినూత్న పథకాలు ప్రకటించారని,బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ అమలుచేసే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వారి పరిపాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడంలేదంటూ ప్రశ్నించారు.ఇప్పటికే కర్నాటకలో విద్యుత్ సరఫరా లేక రైతులు రోడ్డెక్కుతున్నారని ఆ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.అలవకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు.దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు,ఆయా గ్రామాల సర్పంచులు సుశీల బెంజమన్,ఎంపీటీసీలు క్రాంతి కుమార్,సౌజన్య బాలకృష్ణ,గ్రామ శాఖ అధ్యక్షులు కోటేష్,బాబ్జి,విష్ణువర్ధన్ రావు,ప్రధాన కార్యదర్శి సురేష్ నాయుడు,నాయకులు నరసింహారావు,శ్రీకాంత్,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



