నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి మంత్రి ఉత్తమ్
Mbmtelugunews//కోదాడ,జూన్ 20(ప్రతినిది మాతంగి సురేష్):నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరితపించే వ్యక్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారులు సంఘం అధ్యక్షులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం రాయపూడి హిమబిందు జ్ఞాపకార్థం,
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని సిపిఎస్ ఎంఆర్ఎఫ్ పాఠశాలలోని పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు గ్లాసులు స్వీట్లు పంపిణీ చేశారు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ దంపతుల కృషి అభినందనీయమన్నారు. గడచిన కొన్ని నెలలలోనే కోదాడ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని అది కేవలం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితోనే సాధ్యమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపూడి సాత్విక్, సింధు, శ్రీకాకుళం బ్రహ్మం, వంగవీటి ఉదయ్, ప్రధానోపాధ్యాయులు యాదా శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి, నాగమణి, హేమ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.