నియోజకవర్గ వ్యాప్తంగా 150 గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్న డాక్టర్ అంజి యాదవ్
: నియోజకవర్గ యువజన సంఘాలతో డాక్టర్ అంజి యాదవ్ సమావేశం
: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
:గణేష్ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్న:డా,,అంజి యాదవ్
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 07: గణేష్ నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మహిళలు గణేష్ భక్తులు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.శనివారం అంజి యాదవ్ నివాసంలో నియోజకవర్గ యువజన సంఘాల సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయన అంజి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యువత చదువుతోపాటు భక్తి మార్గంలో నడవడం వలన యువత తప్పుదారి పట్టకుండా వారు సక్రమమైన మార్గంలో నడవడానికి ఈ భక్తి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేడు నియోజకవర్గంలో యువత గణేష్ విగ్రహాలను కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అందువలన యువత ఇబ్బంది పడకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 150 విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.ఈ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని అన్నారు.ఈ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ యువజన సంఘాలకు ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శేఖర్ నాయుడు, వెంకన్న,శ్రీకాంత్,వెంకటేష్ బాబు,వంగవీటి శ్రీను,నాగచారి,పవన్,ఠాకూర్ నాయక్,జనార్దన్ రావు,నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ ఉత్సవ కమిటీ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.