కోదాడ,అక్టోబర్ 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్య రాబోయే ఎన్నికలలో యువత నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని టీఎస్ యు ఓయు అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ అన్నారు.శనివారం రాత్రి కోదాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీలకు అతీతంగా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నాయకులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్,నూకల పద్మా రెడ్డి,బిఎస్పి నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్,సామాజిక కార్యకర్త కొల్లు వెంకటేశ్వరరావు,పోడుగు హుస్సేన్,ఐ టిడిపి కార్యదర్శి వివేకానందులు పాల్గొని ప్రవళికకు సంఘీభావం తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆశల చితికి లీకుల నిప్పంటించి నిరుద్యోగులను పాడెలెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖపు విధానం, టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్లనే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవళిక కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.టీఎస్పీఎస్సీ బోర్డ్ నిర్వహించిన ఒక్క ఎగ్జామ్ కూడా పారదర్శకంగా జరగలేదని అన్నీ తప్పులతడకలుగానే జరిగాయని
టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు.కెసిఆర్ కు పార్టీ మీద నాయకుల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేదని రాబోవు ఎన్నికల్లో నిరుద్యోగులందరు ఓటు తో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో శ్రావణ్ కుమార్,హరీష్ యాదవ్,గోపాల స్వామి యాదవ్,శివాజీ నాయక్,ఆనంద్,బోస్,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.



