నిరుపేద,క్యాన్సర్ పేషెంట్ కు ఆర్థిక చేయూత…..
ఉపాధ్యాయుల దాతృత్వ గుణానికి అభినందనలు: ఎంఈఓ సలీం షరీఫ్
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని పీఎంశ్రీ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు , క్యాన్సర్ పేషెంట్ కు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆదివారం ఎంఈఓ సలీం షరీఫ్ చేతుల మీదుగా అందించడం జరిగింది.పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఎండి ఇషాద్ (8 ప, తరగతి ) యొక్క తండ్రి ఎండి యాకూబ్ కోదాడ పట్టణంలో ముస్లిం బజార్ యందు రిక్షా తొక్కుతూ కుటుంబం గడుపుతున్నారు.అతనికి క్యాన్సర్ రోగం రావడం వలన రిక్షా తొక్కడం ఆగిపోవడం,కుటుంబం గడవడం భారంగా,ఇబ్బందిగా ఉన్న పరిస్థితిని తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు కొందరు అతనికి 15000 రూపాయలు ఆర్థిక చేయూత అందించడం జరిగింది.నిరుపేద కుటుంబం అనారోగ్య పరిస్థితుల్లో ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక చేయూత అందించి ఆదుకున్న ఉపాధ్యాయుల దాతృత్వాన్ని కోదాడ మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ స్ఫూర్తిదాయకమని అభినందించినారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,షేక్ ఖాజా మియా,బడుగుల సైదులు,వినకొ ల్లు శ్రీనివాసరావు,ఎండి ముక్తార్ ఆర్థిక చేయూత అందించిన వారిలో ఉన్నారు.