నిరుపేదలకు అండగా నిలిచిన యారగని నాగాశేషు గౌడ్
Mbmtelugunews//కోదాడ, మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో సామాజిక సేవా దృక్పథంతో యారగని నాగాశేషు గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం గుడిబండ గ్రామానికి చెందిన ఎండి ముస్తఫా కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన, వారికి చేదోడువాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో 25 కేజీల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారికి తమవంతు సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యారగని నాగాశేషు గౌడ్ ని అభినందించారు. సహాయం చేసే గుణం అందరికీ ఉండదని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.



