విజయనగరం జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ నగర్ కాలనీ చెందిన బంగారు పరమేష్ వయస్సు 62 సంవత్సరాలు వృత్తిరీత్యా స్వీపర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు వారు నివసిస్తున్న పూరిపాక శిధిలావస్థకు చేరుకోవడం , అదేవిధంగా ఈ మూడు రోజులు కురిసిన వర్షానికి ఇల్లు మొత్తం
కారుతుంది అని వారు విజయనగరం యూత్ ఫౌండేషన్ ను ఆశ్రయించారు వెంటనే స్పందించిన విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్. ఇల్తామాష్ ను సంప్రదించగా వారు బాలి నరేంద్ర మరియు బాలి ప్రతాప్ అను ఇద్దరు దాతలను సంప్రదించి కీర్తిశేషులు బాలి యోగి జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్ధంగా సుమారు పదివేలు విలువచేసే 12 రేకులను వారికి అందజేయడం జరిగింది, ఆ కుటుంబ సభ్యులు విజయనగరం యూత్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్. ఇల్తామాష్, సభ్యులు అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, రాము, విజయ్, రఘు, వినయ్, మహేష్, భాను, కళ్యాణ్, హ్యూమన్ రైట్స్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద ఇంటికి సిమెంట్ రేకులు (వితరణ) సహాయం..
RELATED ARTICLES