Sunday, December 28, 2025
[t4b-ticker]

నిర్మాణ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపింది మోడీ:ఈటెల రాజేందర్ 

నిర్మాణ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపింది మోడీ:ఈటెల రాజేందర్ 

12 కోట్ల మందికి సొంతింటి కల నెరవేర్చిన చరిత్ర మోడీది:బీబీ పాటిల్  

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్ లే:శానంపూడి సైదిరెడ్డి

బస్తాకి 500 రూపాయల బోనస్ ఏమైంది:డా,, అంజి యాదవ్  

కోదాడ,మే 20(మనం న్యూస్):నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో నేడు నెంబర్ వన్ స్థానంలో  నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే నని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ జాతీయ నాయకులు బిబి పాటిల్ లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల శాసనమండలి బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నుండి  విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ 1947 నుండి 2014 వరకు దేశంలో జాతీయ రహదారులు అధ్వానంగా ఉండేవని 2014 నుండి 24 వరకు పదేళ్ల కాలంలో ప్రపంచం గుర్తించిన విధంగా భారతదేశంలో జాతీయ రహదారులు నిర్మించిన రికార్డు మోడీదే అన్నారు.గతంలో రోజుకి 11 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే మోడీ పాలనలో రోజుకు 37 కిలోమీటర్ల జాతీయ రహాధారులు నిర్మించారన్నారు.గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ నుండి మొదలుకొని నేడు రాహుల్ గాంధీ వరకు అంటున్నారే తప్ప వాళ్ళ హయాంలో పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు దేశంలో 12 కోట్ల మందికి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత మోడీ ప్రభుత్వం అన్నారు.రూ 500,రూ 2000 నోట్లతో చిల్లర కు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఫోన్ పే గూగుల్ పే ద్వారా  నగదు బదిలీలు సులభతరం చేసిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అన్నారు.భారతదేశం నుండి మెడిసిన్ చదవడానికి రష్యా ఉగ్రామ్ దేశాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడ యుద్ధంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఇక్కడి తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రధాని మోడీ ఆయా దేశాల అధ్యక్షులతో మాట్లాడి ఆ పిల్లలు భారతదేశానికి సురక్షితంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారన్నారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో 2జి స్కామ్ లు లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ జరిగిందన్నారు.గతంలో దేశంలో రాష్ట్రంలో బాంబు పేలుళ్లతో శరీరాలు ముక్కలై అరాచక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మోడీ పాలనలో పదేళ్లలో ప్రజలు భయభ్రాంతులు లేకుండా శాంతియుతంగా జీవనం గడుపుతున్నారు.గతంలో దేశంలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ తెలంగాణలో హైదరాబాదులో జరిగిన హింసాత్మక చర్యలను ఆయన వివరించారు.తెలంగాణలో కెసిఆర్ పాలనలో మాటలు కోటలు దాటాయే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.ప్రస్తుతం గత రెండు రోజుల నుండి నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్నామని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కాంగ్రెస్ కి ఓటేసి తప్పు చేశామని అంటున్నారని చెప్పారు.కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు కాలిపోతున్న కరెంటు మోటార్లు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని 500 రూపాయల బోనస్ నీటి మూటగానే మిగిలిందన్నారు.

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిట్టలదొర మాదిరిగా ఆరు గ్యారెంటీలు 66 హామీలు 460 రకాల వాగ్దానాలు చేశారే తప్ప ఉచిత బస్సు ప్రయాణం తప్ప అమలైంది ఒక్కటి లేదన్నారు.పట్టబద్రులు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం నల్లగొండ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ మోడీ సంక్షేమ పథకాలతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి ,రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ ,కోదాడ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణ.నూనె సులోచన,బొలిశెట్టి కృష్ణయ్య,అక్కిరాజు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular