నువ్వా నేనా: DC,RR ఉత్కంఠ పోరు
చివరికి సూపర్ ఓవర్‌లో ఢిల్లీ విజయం సాధించింది
Mbmtelugunews//హైదరాబాద్,ఏప్రిల్ 17(ప్రతినిధి మాతంగి సురేష్):ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించింది.ఆఖరి బంతి వరకు ఇరు జట్లను విజయం దోబూచులాడింది.
చివరి బంతికి మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (49; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (38; 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టబ్స్ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (34; 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు )లు రాణించారు.
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. మహేశ్ తీక్షణ, వనిందు హసరంగ చెరో వికెట్ పడగొట్టారు. అనం తరం లక్ష్య ఛేదనలో రాజ స్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది.
రాజస్థాన్ బ్యాటర్లలో నితీశ్ రాణా (51; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (51; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ టైగా ముగియడం తో సూపర్ ఓవర్ అనివార్య మైంది. సూపర్ ఓవర్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 11 పరుగలే చేసింది. 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగో బంతికే ఛేదించింది.
చివరి సారిగా 2021లో ఐపీఎల్‌లో సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీ గెలవడం విశేషం. నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పై ఢిల్లీ విజయం సాధించింది.