నూతనంగా ఎన్నికైనా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కు గుర్తింపు పత్రం
Mbmtelugunews//కోదాడ, జులై 13(ప్రతినిది మాతంగి సురేష్): ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరిగిన రాష్ట్ర ఎక్సక్యూటివ్ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహ రావు మాట్లాడుతూ మాకు అన్ని విధాలుగా సాయసహకారాలు అందించిన రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సహకారంతో జిల్లా కబడ్డీ క్రీడాకారులని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దుతాం అని అన్నారు. అదే విదంగా మా పై నమ్మకం తో మాకు బాధ్యతలు ఆపగించిన రాష్ట్ర అధ్యక్షు, కార్యదర్శులు కాసాని వీరేష్ కి, మహేందర్ రెడ్డికి ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.