నూతనంగా సర్పంచిగా ఎన్నికైన బలుగూరి స్నేహ దుర్గయ్యను సన్మానించిన బాల్యమిత్రుడు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): గణపవరం గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బల్గూరి స్నేహ దుర్గయ్య నివాసంలో బాల్యమిత్రుడు రామలక్ష్మిపురం బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి శాలువా, బొకేతో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ నా బాల్యమిత్రుడు దుర్గయ్య సతీమణి స్నేహ గణపవరం గ్రామపంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిన్ను నమ్మి ఓట్లు వేసిన గ్రామ ప్రజల నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జవాజి నాగేశ్వరరావు, సానికొమ్ము తరుణ్ రెడ్డి, కొండా ధనమూర్తి, అమరగాని లక్ష్మయ్య, పోశం శ్రీను, ముసిని శ్రీను, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



