నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నయానగర్ లో గల బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ చేతుల మీదగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ డిసెంబర్ మాసంలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని వారన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి యేసయ్య మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు.2025 నూతన క్యాలెండర్ ను ప్రతి ఒక్కరూ వారి ఇండ్లలో ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ లు మాడుగుల సుందర్ రావు,రాజేష్,యేసురత్నం,దానియేలు,హ్యారీగోమ్స్ తదితరులు పాల్గొన్నారు.