
సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల పరిధిలోని పసునూర్ లో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన నిర్మాణం తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెలు చేతుల మీదుగా ప్రారంభం చేయనైనది.నేను పసునూర్ గ్రామానికి రుణపడి ఉంటాను అని అన్నారు. అలాగే కొందరు బి.అర్.ఎస్ పార్టీకి చెందిన మాజీ వార్డు సభ్యులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమాటం సునీత శ్రీను,ప్రభుత్వ అధికారులు,మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ పంచాయితీ సభ్యులు,ప్రజలు,ప్రజలు పాల్గొన్నారు.



