నూతన శకానికి నాంది పలికిన గ్రామ ప్రజలు
:రెపరెప లాడిన బిఆర్ఎస్ జండా
:దొంతగాని అప్పారావు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
:అభివృద్ధి వైపే తెలుగు వేసిన విద్యావంతులు మేధావులు యువత ప్రజలు
:మీ నమ్మకాన్ని ఓమ్ము చేయను కంకణ భద్దుడనై పనిచేస్తాం
:కాపుగల్లు బిఆర్ఎస్ సర్పంచ్ దొంతగాని అప్పారావు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన కాపుగల్లు గ్రామంలో మేధావులు విద్యావంతులు ప్రజలు నూతన శకానికి నాంది పలికారు.గ్రామంలో సుమారు 4500 ఓట్లుకు గాను 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు 9వార్డులు కాంగ్రెస్ గెలుచుకోగా 3 వార్డులు బిఆర్ఎస్ గెలుచుకున్నది. ఈ 12 వార్డులలో కాంగ్రెస్ కు 800ల మెజార్టీ ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని ధీమాతో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన నాటి నుండి ముగింపు వరకు బిఆర్ఎస్ అభ్యర్థి లీడ్ పెంచుకుంటూ ముందుకు సాగాడు. కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి బిఆర్ఎస్ అభ్యర్థి దొంతగాని అప్పారావు 346 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించడంతో గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు నిర్వహించారు.

కాగా సర్పంచ్ దొంతగాని అప్పారావు గత ఐదు సంవత్సరాల నుండి గ్రామంలో 40 లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంఘటనలు కూడా ఆయన గెలుపుకు కారణం అయి ఉంటాదని పలువురు వాపోతున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి బాసటగా నిలిచాడు, గ్రామంలో దేవాలయాల నిర్మాణాలకు పూర్తి సహాయ సహకారాలు అందించాడు, గ్రామంలో వీధిలైట్లు తన సొంత ఖర్చులతో వేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి, అంతేకాకుండా గ్రామంలో యువత తన గెలుపుకై అహర్నిశలు కృషి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నన్ను నమ్మి ఎంత మెజారిటీతో నన్ను గెలిపించిన మేధావులకు విద్యావంతులకు యువతకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ దొంతగాని అప్పారావు.



