నెమలిపురి రెసిడెన్షియల్ పాఠశాలలో దోమల మందు పిచికారి.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 09:కోదాడ మండల పరిధిలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దోమల నివారణ నిమిత్తం (ఆల్ఫా సైపర్ మెత్రిన్) ఏసిఎం పౌడర్ ను నీటితో కలిపి పాఠశాల మొత్తం పిచికారి చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత అవసరం అన్నారు.దోమల ద్వారా మలేరియా,ఫైలేరియా,చికెన్ గున్యం,మెదడువాపు,డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున దోమ పుట్టకుండా,దోమ కుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా నెమలిపురి సాంఘిక సంక్షేమ పాఠశాలలో దోమల మందు పిచికారి చేశారు.ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సురేందర్, పిహెచ్ఎన్ అనంతలక్ష్మి,పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది యాతాకుల మధుబాబు,మీనా కుమారి,ఉపాధ్యాయులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.