కోదాడ,ఏప్రిల్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తక్కగూడ కేంద్రంగా జరగనున్న జన జాతరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ పిలుపునిచ్చారు.కోదాడ నుంచి తుక్కగూడ సభకు బయలుదేరుతూ కోదాడలో షేక్ రఫీవిలేకరులతో మాట్లాడుతూ దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. నరేంద్ర మోడి పదేళ్ల ఎన్డీఏ పాలనకు చరమగీతం పలకాలనే కృతనిశ్చయంతో ఉందని ఈరోజే లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గడ్డమీద,అదీ శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది అని అన్నారు.ఈ భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న అయిదు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటిస్తుందని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ అన్నారు.
నేడు తుక్కగూడ కేంద్రంగా జరగనున్న జన జాతర సభను విజయవంతం చేయాలి:షేక్ రఫీ
RELATED ARTICLES



