కోదాడ,అక్టోబర్ 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్ కోదాడ పట్టణంలో ఆదివారం జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం అయిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ రవీందర్రావు,బిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి తదితర నాయకులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు జనం సిద్ధం అయ్యారు.జన జాతర కు సర్వం సిద్ధం ఆదివారం 12:00 గంటలకు సీఎం రానున్నారు.

బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి.దళిత బంధు కు,కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలకు,అభివృద్ధికి అడ్డుపడ్డ ఎంపీ ఉత్తమ్ హైదరాబాదు,బెంగళూరుకు పరిమితమైన నాయకులు వాళ్లు అని అన్నారు.ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు ఏళ్ల కొద్దీ పాలించి కోదాడ ను అనాధగా మార్చారు సీఎం కేసీఆర్ ఆశీర్వదించి 2018లో టికెట్ ఇచ్చి గెలిపించిన నాటినుండి నేటి వరకు ప్రజల్లో ఉండి పనిచేస్తున్న 70 నుండి 80 వేల జనాభా సీఎం సభకు హాజరవుతారు అని తెలిపారు.



