నేరాల అదుపున కే సీసీ కెమెరాలు ఏర్పాటు:ఎస్సై కస్తాల గోపికృష్ణ
:అనాజిపురం ,మాచారం గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరా ఏర్పాటు
Mbmtelugunews//సూర్యాపేట,ఏప్రిల్ 20 (ప్రతినిధి మాతంగి సురేష్):గ్రామాల్లో జరిగే నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని స్థానిక ఎస్సై కస్తాల గోపికృష్ణ అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని అనాజిపురం,మాచారం గ్రామాల్లో దాతల సహకారంతో అందించిన సీసీ కెమెరాలను ప్రధాన వీధుల్లో,ఆలయాల వద్ద ఏర్పాటు చేసి మాట్లాడారు ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలకు పాల్పడ్డ వారిని వెంటనే గుర్తించొచ్చని తెలిపారు.గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.అన్ని గ్రామాల్లో దాతలు ముందుకు వస్తే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.గతంలో కొన్ని గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేక పట్టించుకునే వారి లేక అవి మరమత్తులకు గురయ్యాయని అన్నారు.ఇకనుండి దాతల సహకారంతో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ బోల్లక బోబ్బయ్య,వివిధ పార్టీల నాయకులు ఇటుకల శ్రీనివాస్,బొల్లక సైదులు,రమణారెడ్డి,గ్రామాల ప్రజలు,పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు..