నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి
:ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 16 (ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కస్పాండెంట్ పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని,నైతిక విలువతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భాగంగా టీచర్ పాత్రదారులు పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, డీఈవో లుగా పి అన్విత ,లక్ష్మీ ప్రసన్న పలువురిని ఆకట్టుకున్నారు.ఉపాధ్యాయ పాత్రలను పోషించిన శివ,వర్షిత,భార్గవి,వేదాక్షరి,ఆకర్ష్,అపర్ణ,రక్షిణి తదితరులు పాల్గొన్నారు.