న్యాయవాదుల ఆధ్వర్యంలో “మా వాటా మాకే” పుస్తకావిష్కరణ
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 13 ప్రతినిధి మాతంగి సురేష్:చట్ట సభల్లో,స్థానిక సంస్థల్లో బిసిల వాటా బిసి లకే దక్కాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో జూలూరు గౌరీశంకర్ వ్రాసిన పుస్తకాన్ని బీసీ న్యాయవాదుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రామినేని రామకృష్ణ,పాలేటి నాగేశ్వరరావు,గట్ల నర్సింహారావు,ఈదుల కృష్ణయ్య లు మాట్లాడుతూ బీసీలు కులాల వారీగా చీలిపోయి నష్టపోతున్నారని,అగ్రవర్ణాల నాయకత్వంలో జెండాలు మోసే క్యాడర్ గానే మిగిలిపోతున్నారని వారిని చైతన్యం చేయడానికి మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ వ్రాసిన పుస్తకం చాలా ఉపయోగ పడుతుందన్నారు.రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల వరకు బీసీల కులగణన చేపట్టి,ఆ లెక్కన బీసీ లకు సీట్లు కేటాయించాలని,చట్ట సభల్లో కూడా బీసీలకు తగిన వాటా కల్పించాలని కోరారు.బీసీలు తమ వాటా తమకు దక్కేంతవరకు పోరాటాలు చేయాలని అందుకు న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు నాళం రాజయ్య,ఉయ్యాల నర్సయ్య,బెల్లంకొండ గోవర్ధన్,తాటి మురళి,కోడూరు వెంకటేశ్వరరావు,వెంకటాచలం,కె శరత్ కుమార్,ఏ సుదర్శన్,కొండ భీమయ్య,చెన్నా పెద్దబ్బాయి,కానుగు మురళి,రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.



