Wednesday, December 24, 2025
[t4b-ticker]

న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి: ఉయ్యాల నర్సయ్య

న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి: ఉయ్యాల నర్సయ్య

Mbmtelugunews// కోదాడ, సెప్టెంబర్19 (ప్రతినిధి మాతంగి సురేష్) : న్యాయవాదుల రక్షణ చట్టాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా వివిధ కోర్టులో న్యాయవాదులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా శుక్రవారం కోదాడ కోర్టులో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ
నిన్న రంగారెడ్డి జిల్లా మంచాల (ఇబ్రహీంపట్నం) పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులు బి అనిల్, హనుమ నాయక్ లు ఒక 498A కేసు విషయంలో మంచాల పోలీసు స్టేషన్ కు వెళ్లి వస్తుంటే కంప్లైంట్ తరపు వారు న్యాయవాదులపై జరిపిన దాడిని అందరూ ఖండించాలన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఏర్పాటు చేయాలని నిరాహారదీక్ష చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడాని వ్యతిరేఖించాలన్నారు.న్యాయవాదులు కేవలం చట్టపరంగా కక్షిదారులు కోసం వృత్తి పరంగా పనిచేస్తారు తప్ప వారికి ఎలాంటి వ్యక్తిగత అభిష్టాలు ఉండవని వాటిని అర్ధం చేసుకోకుండా దాడులకు దిగడం దారుణమన్నారు.న్యాయవాదుల పై దాడులు అంటే అది న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు, ప్రజాస్వామ్యానికి అవమానకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిరసనగా కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నాగుబండి కృష్ణమూర్తి, యడ్లపల్లి వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వరరావు, నయిమ్, రమేష్, హుస్సేన్, చలం, కె మురళి సీనియర్ న్యాయవాదులు పాలేటి నాగేశ్వరరావు, తమ్మినేని హనుమంతరావు, రంజాన్ పాషా, సిలివేరు వెంకటేశ్వర్లు, గట్ల నర్సింహారావు, ఈదుల కృష్ణయ్య, రాజారాం, యశ్వంత్, రహీం, గోవర్ధన్, దొడ్డ శ్రీధర్, బాలయ్య, హేమలత, నాగుల్ మీరా, వెంకటేశ్వర్లు, నాగరాజు, కోదండ పాణి, శరత్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular