పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:అనారోగ్య బాధితుడుతున్న తేజా కు పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం గురువారం అందించడం జరిగింది.వివరాల్లోకి వెళితే మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీను మంగమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు తేజా జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి తీవ్ర అస్వస్థతకు లోనైన సంగతి తెలుసుకున్న పందిరి ఫౌండేషన్ గౌరవ సలహాదారు యస్ యస్ రావు స్పందించి ఫౌండేషన్ సభ్యులు యన్ఆర్ఐ నకిరికంటి సత్య కిరణ్ (లండన్ )ను సంప్రదించగా 5000 ఆర్థిక సాయం పంపించగా గురువారం నాడు బరాకత్గూడెం లో వారి కుటుంబ సభ్యుడు మొలుగూరి ప్రదీప్ కు పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి ద్వారా అందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు యస్ యస్ రావు,సభ్యులు బాలాజీ,గ్రామస్థులు ఓరుగంటి రవి,సైదులు,శ్రీకాంత్,ఉపేందర్,యూసఫ్,వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.