:ఫామ్ 18 లో పట్టభద్రుల ఓటు హక్కు కు దరఖాస్తు చేసుకోవాలి.
:పట్టభద్రుల ఓటు నమోదుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి.
:ఎమ్మార్వో, ఎండిఓ ,ఏఇఓ, కళాశాల ప్రిన్సిపల్స్ కు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆర్డీవో సూర్యనారాయణ.
కోదాడ,జనవరి 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అర్హత కలిగిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్డిఓ సూర్యనారాయణ అన్నారు.గురువారం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో కోదాడ రెవెన్యూ డివిజన్ లోని ఎమ్మార్వో,ఎంపీడీవో,ఏఇఓ,కళాశాల ప్రిన్సిపాల్ లకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడుతు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ఉన్నందున పట్టభద్రుల ఓటర్ జాబితా తయారీకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రక్రియను ప్రారంభించామన్నారు.

ఫిబ్రవరి 6 వరకు పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.అని మండల కార్యాలయాల్లో ఫామ్ 18 ఓటు హక్కు నమోదుకు సిద్ధం చేశామన్నారు.పట్టబద్రులు ఓటు హక్కు నమోదు కోసం విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ లోని తహసీల్దార్లు సాయి గౌడ,ఆంజనేయులు,హేమమాలి,రవికుమార్,ఎంఈఓ సలీం షరీఫ్,ఎస్ఎల్ఎంటి రమేష్,డిఎల్ఎంటి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.



